ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు..ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు..ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్
  •     విచారణకు కోర్టు అనుమతి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో హరీశ్‌‌‌‌‌‌‌‌ను ప్రతివాదిగా చేరుస్తూ  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు రానున్నది. సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు, పోలీస్ అధికారి రాధాకిషన్ రావుపై గతేడాది పంజాగుట్ట స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కంప్లయింట్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

దీనిపై పోలీసులు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేశారు. విచారణ అనంతరం హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పీఏ వంశీకృష్ణతోపాటు ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌‌‌‌‌‌‌‌కు పంపారు. అయితే, ఈ ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్వాష్ చేయాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అదే ఏడాది డిసెంబర్ 4న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్వాష్ చేస్తూ  ఈ ఏడాది మార్చి 20 న ఆదేశాలు ఇచ్చింది. 

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చక్రధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. కాగా, చక్రధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ కంప్లైంట్ ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.