ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు

ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు

హైదరాబాద్: పోలింగ్ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా ముగ్గురేసి అధికారులను పెట్టి ప్రభుత్వం చాలా కష్టపడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచారన్నారు. 

ఐదేండ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో  ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. దయచేసి అందరూ బయటికి వచ్చి పోలింగ్ లో  పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ  నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు సోదరుడి లాంటి వారని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.  ఆరు గ్యారంటీలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని గుర్తించాలని అన్నారు. 

కరెంటు కోతలు, నీటి కొరతల వంటి అసలైన సమస్యల పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు  చెప్పారు.  ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుందని అన్నారు. పదేండ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం తాను ఓటేశానని, అందరూ ఓటేయాలని కోరారు.