T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్‎లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 27) న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలించింది. దీంతో కివీస్ కెప్టెన్ మిచెల్ సాంటర్న్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ 2లో ఏ జట్టు సెమీస్‎కు వెళ్తుందనేది తేలిపోనుంది. సూపర్ 8 స్టేజ్‎లో ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. 

న్యూజిలాండ్‎కు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డై. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇంటి దారి పడుతోంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే కివీస్‎కి సెమీఫైనల్స్ అవకాశం క్లిష్టంగా మారడంతో పాటు పాక్ కు సెమీస్‎కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ పాక్, కివీస్ రెండిటికీ కీలకం.

జట్లు:

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్