Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్‌పై నీలినీడలు.. బిజినెస్ క్లోజ్ కాకపోవడానికి కారణం ఇదేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్‌పై నీలినీడలు.. బిజినెస్ క్లోజ్ కాకపోవడానికి కారణం ఇదేనా?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' . భారీ అంచనాలతో ఈ సినిమా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల  కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, సాంగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదని టాక్ వినిపిస్తోంది.  ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

డిజిటల్ రైట్స్‌లో రికార్డు!

థియేట్రికల్ బిజినెస్ విషయంలో కాస్త సందిగ్ధత ఉన్నప్పటికీ, డిజిటల్ మార్కెట్‌లో మాత్రం  'ఉస్తాద్ భగత్ సింగ్'  సినిమా రికార్డు సృష్టించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు 82 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తెలుగు సినిమాకు ఇంత భారీ ధర లభించడం పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు నిదర్శమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఈ భారీ డీల్ సినిమాపై అంచనాలను మరింత పెంచడమే కాకుండా, మేకర్స్‌కు పెద్ద ఊరటనిచ్చిందని టాక్ వినిపిస్తోంది.

గబ్బర్ సింగ్ కాంబో.. కానీ తగ్గని టెన్షన్!

'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ - దేవి శ్రీ ప్రసాద్ (DSP) కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి రావడంతో అభిమానుల అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అయితే, థియేట్రికల్ పంపిణీ విషయంలో మాత్రం కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మేకర్స్ కోట్ చేస్తున్న భారీ ధరలు. అన్ని ఏరియాల్లోనూ నిర్మాతలు రికార్డ్ స్థాయి రేట్లు అడుగుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఆచితూచి అడుగువేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పవన్ సినిమా అంటే నెల రోజుల ముందే బిజినెస్ పూర్తవుతుంది, కానీ ఉస్తాద్ విషయంలో ఇంకా చర్చలు సాగుతూనే ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

రీమేక్ ముద్ర..

అంతే కాకుండా ఈ సినిమా మొదట విజయ్ నటించిన తమిళ చిత్రం 'తేరి'కి రీమేక్ అని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో  సమూల మార్పులు చేశామని, ఇది దాదాపు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా అని డైరెక్టర్ హరీష్ శంకర్  క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కంటెంట్ విషయంలో ఒక స్పష్టత కోరుకుంటున్నారు. ముఖ్యంగా టీజర్ లేదా ట్రైలర్ చూసిన తర్వాతే డీల్స్ ఫైనల్ చేద్దామనే ఆలోచనలో వారు ఉన్నట్లు సమాచారం.

ప్రమోషన్ల లోటు!

ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు మిశ్రమ స్పందనను అందుకున్నాయి.  దేవి శ్రీ ప్రసాద్ నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఆశించిన  రేంజ్‌లో పాటలు లేకపోవడం కూడా బిజినెస్‌పై ప్రభావం చూపుతోందని టాక్. అలాగే ప్రమోషనల్ వీడియోల కొరత కూడా ఒక మైనస్‌గా మారిందని సినీ వర్గాల్లో చర్చనడుస్తోంది. విడుదలకు కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే ఉండటంతో, రాబోయే రోజులు 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్‌కు చాలా కీలకం. ఒకవేళ ట్రైలర్ గనుక నెక్స్ట్ లెవల్‌లో ఉంటే, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అడిగిన రేట్లకు క్యూ కడతారనడంలో సందేహం లేదు. అప్పటివరకు ఈ 'ఉస్తాద్' థియేట్రికల్ బిజినెస్ సస్పెన్స్‌గానే మిగిలిపోనుందని టాక్ వినిపిస్తోంది.