ఈ ఏడాది (2026) మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు పాక్షిక కేతుగ్రస్త గ్రస్తో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్వ ఫాల్గుణ నక్షత్రం, సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహణం వేళ కొన్ని మంత్రాలను పఠించడం వలన జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఈ స్టోరీలో ఏ రాశి వారు ఎలాంటి మంత్రాలు పఠించాలి.. ఏయే మంత్రాలు పఠించాలి మెదలగు పూర్తి వివరాలను తెలుసుకుందాం...
భారత కాలమానం ప్రకారం2026 మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:21 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. అంటే గ్రహణ వ్యవధి మొత్తం దాదాపు 3 గంటల 27 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది
మేష రాశి: ఈ రాశికి కుజుడు అధిపతి.. ఈ రాశివారు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం స్వాహా’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనితో పాటుగా హనుమాన్ చాలీసా పఠించాలి.
వృషభ రాశి : ఈ రాశికి శుక్రుడు అధిపతి .. ఈ రాశి వారు ఓం శీతాంశు, విభాంశు అమృతాంశు నమః’ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో.. వ్యాపారంలో కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి : ఈ రాశి వారికి బుధుడు అధితి. దుర్గాదేవిని పూజించాలి. చంద్రగ్రహణం రోజు కుల దైవాన్ని పూజించాలి...ఓం శ్రమ శ్రమ శ్రమం సః చంద్రమసే నమః.. అనే మంత్రాన్ని పఠించాలి.
కర్కాటక రాశి: ఈ రాశికి చంద్రుడు అధిపతి.. ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మార్చి 3 చంద్రగ్రహణం ముగిసిన తరువాత శివాలయంలో అభిషేకం చేయాలి. గ్రహణ సమయంలో.. ఓం రాం రాహవే నమః.. అనే మంత్రాన్ని పఠించాలి.
సింహ రాశి: మార్చి 3న కేతు గ్రస్త చంద్రగ్రహణం ఇదే రాశిలో ఏర్పడుతుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు.. గ్రహణ సమయంలో ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని చదవాలి... ఓం సూర్యాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి : ఈ రాశి వారికి బుధుడు అధిపతి.. వినాయకుడిని పూజించాలి. ..ఓం గం గణపతయే నమః.. అని 108 సార్లు పఠించాలి. ఆ తరువాత ...ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః ..అనే మంత్రాన్ని పఠించడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు
తులా రాశి : ఈ రాశి వారు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ...ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః.. అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శివుడిని ఆరాధించడంతో పాటు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి.
వృశ్చిక రాశి : ఈరాశికి కుజుడు అధిపతి. మార్చి 3 న కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో ...ఓం క్రం క్రీం క్రౌం సః భౌమాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలొస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనస్సు రాశి : ఈ రాశి కి గురుడు అధిపతి.. కేతు గ్రస్త చంద్రగ్రహణం సమయంలో ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమ: అనే మంత్రాన్ని జపించడం మంచిది. గ్రహణం వీడిన తరువాత విష్ణుసహస్రనామం పఠించాలి.
మకర రాశి : ఈ రాశి శని దేవుడు అధిపతి ..కేతు గ్రస్త చంద్రగ్రహణ సమయంలో ఈ రాశి వారు శని చాలీసా పఠించాలి.. ఆ తరువాత ...ఓం శం శనైశ్చరాయ నమః.. అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి : ఈ రాశికి కూడా శని దేవుడే అధిపతి. ఓం హ్రీం కాలికాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వలన జీవితంలో పురోగతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మీన రాశి : ఈ రాశి వారు చంద్రగహణ సమయంలో ...ఓం స్రాం స్రీం స్రోం సహ చంద్రమసే నమః.. అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
