ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత ఫైరయ్యారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణం..? మీ అహంకారమే మీ పతనానికి నాంది.. లిక్కర్ స్కాం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని కారు కూతలు కూస్తున్నారు.. BJP, BRS ఒక్కటే అన్నదానికి కేటీఆర్ స్టేట్మెంట్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.. పార్టీ కోసమే కదా నేను జైలుకు పోయింది.. రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలి.. నేను ధైర్యంగా వచ్చాను.. అంటూ విమర్శలకు దిగారు కవిత.
శుక్రవారం (ఫిబ్రవరి 27) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్న తనకు క్లీన్ చిట్ రావడం సంతోషం అని అన్నారు
ALSO READ : కవితకు కోర్టులో న్యాయం జరిగింది
కవిత కామెంట్స్:
- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది
- భారత న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు
- కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తాను అని ముందు నుంచే చెప్తున్నా
- 5 నెలలు పిల్లలు, కుటుంబానికి దూరంగా ఉన్నాను.. చాలా అవమానాలు ఎదుర్కొన్నాను
- ఇక్కడ నా పిలల్లు ఒంటరిగా ఉన్నపుడు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు
- మా నాన్న, అమ్మకు, అత్తకు, మా నాన్న సైడ్ వారికి, భర్త తరపున అండగా ఉన్న వారికి ధన్యవాదాలు
- నిజామాబాద్ రైతుల సమస్యలు, ఖమ్మం పామ్ ఆయిల్ సమస్యలు రైతు కమిషన్ కు వివరించినం
- మా అన్న కేటీఆర్ కంగ్రాజులేషన్స్ చెప్తూనే.. బీఆర్ఎస్ ఓడిపోవడానికే నా కేసు కారణం అన్నట్లు చెపుతున్నారు
- బీఆర్ఎస్ సోషల్ మీడియాలో నాదే తప్పు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు
- పార్టీ కోసమే కదా నా మీద కేసు వేసింది..
- బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఓడిపోవడానికి నేను ఎట్లా కారణం...? ప్రజలు ఆలోచన చేయాలి
- ప్రజలకు ఇండ్లు ఇవ్వలేదని.. కదా ఓడగొట్టారు
- ఇవాళ తీర్పును వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు...
- ఇవాళ పొద్దున్న నుంచి అడ్డమైన ప్రచారం చేస్తున్నారు
