హైదరాబాద్‌లో ఓటర్ల ఆందోళన

హైదరాబాద్‌లో ఓటర్ల ఆందోళన

హైదరాబాద్ షేక్ పేట్ సక్కూభాయ్ మెమోరియల్ స్కూల్ దగ్గర ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటు వేయడానికి వచ్చిన 2వందల మంది ఓటర్ల పేర్లు.. లిస్ట్ లో డిలీట్ అయ్యాయి. తమ పేరు ఓటర్ లిస్ట్ లో ఎందుకు లేదని పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బూత్ ముందే బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు ఓటేసే అవకాశం ఇవ్వాలని లేకపోత.. రిపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. పోలింగ్  బూత్  ను సందర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొత్త  ఓటర్ లిస్ట్ పేరుతో చాలామంది పేర్లు డిలిట్ చేశారని.. ఈసీ వికాస్ రాజ్ కు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.