
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది.
తెలంగాణలో 52.34శాతం పోలింగ్
మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే మినీ ఇండియాగా పేరున్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో మాత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు 37.69శాతం పోలింగ్ నమోదైంది.
ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
పోలింగ్ సిబ్బందిపై అర్వింద్ ఆగ్రహం
నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మైనారిటీ ఏరియాలోని పోలింగ్ భుత్ లను సందర్శించారు. మైనార్టీ మహిళ ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని అధికారులను నిలదీశారు. హిజాబ్, మాస్క్ లుంటే నిజమైన ఓటర్లని ఎలా గుర్తిస్తున్నారని ఎలక్షన్ సిబ్బందిని ప్రశ్నించారు. పోలింగ్ భుత్ ల బయట జనం గుంపులు ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి చెంచాగిరి చేస్తున్నారని నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) స్వగ్రామం ధన్వాడలో 151 వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వేశారు.
- మణికొండ మున్సిపాలిటీ పీజీ కాలేజీలో ఓటు వినియోగించుకున్న జగపతిబాబు
- మణికొండలో ఓటు హక్కు వినియోగించుకున్న శివ బాలాజీ కుటుంబ దంపతులు
- సికింద్రాబాద్ గోపాలపురం, సేంట్ పాట్రిక్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రాచకొండ సిపి తరుణ్ జోషి
- వెంకటగిరి లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ సిఐడి చీఫ్ షికా గోయల్
బీజేపీ,కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం
నాచారం డివిజన్లోని భవాని నగర్ లో బిజెపి ,కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ విఎస్ ఎస్ ప్రభాకర్ పార్టీ కండువాతో పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు ఇరు వర్గాలను సర్దిచెప్పారు.
బీజేపీకి మ్యేజిక్ ఫిగర్ కూడా దాటదు: రేవంత్
ఈ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ తన చాలెంజ్ ను స్వీకరించలేదన్నారు.ఈ ఎన్నికలు తమ పార్టీకి రెఫరెండమన్నారు రేవంత్. బీజేపీకి 200 సీట్లు కూడా రావని..బీజేపీ మ్యేజిక్ ఫిగర్ కూడా దాటబోదన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. బీజేపీతో ఒరిగేదేం లేదని..ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జనగామలో ఉద్రిక్తత
జనగామ జిల్లాలోని గానుగపహాడ్ గ్రామంలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు పోలీసులు కొట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసేందుకు వెళ్లిన తమపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. గుంపుగా ఉన్నందుకే వారిని హెచ్చరించామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్ షేక్ పేట్ సక్కూభాయ్ మెమోరియల్ స్కూల్ దగ్గర ఓటర్లు ఆందోళనకు దిగారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు లిస్ట్ లో తమ పేరు కనిపించకపోవడంతో 200 కి పైగా ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ బూత్ ముందు బైఠాయించారు ఓటర్లు. తమ ఓటు తమకు కావాలని ఆందోళన చేశారు., ఓటు వేసే అవకాశం కల్పించాలి.. లేదా రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
-
ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ జివి హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.
-
పాతబస్తీత శాస్త్రీపురంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదయ్యింది. హైదరాబాద్ పార్లమెంట్ లో 10.70 శాతం, మల్కాజ్ గిరిలో 15.05, సికింద్రాబాద్ లో 15.77,చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదయ్యింది. మహబూబాబాద్ లో 30.66 శాతం, నల్గొండలో 31.21 శాతం, పెద్దపల్లి పార్లమెంట్లో 26.33 శాతం, నిజామాబద్ లో 28.26, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 పోలింగ్ నమోదయ్యింది.
-
మహబూబ్ నగర్ లోని కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు రేవంత్. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
-
సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
-
హైదరాబాద్ నందినగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ ఓటు వేశారు
-
హైదరాబాద్ లో ఓటు వేశారు రాష్ట్ర సీఎస్ శాంతికుమారి
-
సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్‌లో తన సతీమణితో కలిసి ఓటు వేసిన హరీశ్
- జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో సీనియర్ నటుడు కోటశ్రీనివాస్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్రసాయంతో నడుచుకుంటూ వచ్చిన ఆయన తన ఓటు వేశారు.
- సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ బయల్దేరారు. కాసేపట్లో కొడంగల్ లో ఓటు వేయనున్నారు.
- ఓటు వేసిన దర్శకుడు రాజమౌళి దంపతులు.
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- హైదరాబాద్ రహీంపురాలోని ఎస్ఎస్కే డిగ్రీ కాలేజీలోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.
- నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బూత్ నెంబర్ 99 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి.
- బంజారాహిల్స్ NBT నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, నగర మేయర్ విజయలక్ష్మి
- బంజారాహిల్స్ NBT నగర్ లోని పోలింగ్ సెంటర్ ని సందర్శించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్
- సనత్ నియోజకవర్గం మొండా మార్కెట్ డివిజన్ లోని ఇస్లామీయ హై స్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్
పోలింగ్ బూత్ కోసం తండా వాసుల ఆందోళన
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు. లేటెస్ట్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తండవాసులు ఓటు వేయకుండా నిరసనకు దిగారు.తమ తండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నందును వృద్ధులు,వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. బస్సు సౌకర్యం కూడా లేనందును తండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు . విషయం తెలుసుకున్న కొత్తూరు ఎమ్మార్వో తండా ప్రజలకు వచ్చే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ అనంతరం తాండ వసూలు నిరసనను విరమించారు.
- హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ
- చేవెళ్ల మండలం గొల్లపల్లి ధర్మసాగర్ పరిధిలోని పాఠశాలలో ఓటు వేశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- నిజామాబాద్‌లో ఓటు వేశారు బీజేపీ ఎంపీ అర్వింద్ దంపతులు
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ లో కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 9.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
- బోయిన్ పల్లిలోని సెయింట్ పీటర్ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి
- కరీంనగర్ లోని జ్యోతి నగర్ లో ఓటు వేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్
- హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు డైరెక్టర్ తేజ దంపతులు. ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని తర్వాత అనొద్దు..ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు తేజ.
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్ పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రొఫెసర్ కోదండరాం దంపతులు.
పోలింగ్ పై ప్రధాని మోదీ ట్వీట్
ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారని నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అని ట్వీట్ చేశారు మోదీ.
70 శాతం పోలింగ్ నమోదు కావొచ్చు: వికాస్ రాజ్
తెలంగాణలో 70 శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ ఉదయం ఎస్సార్ నగర్‌లోని ఆదర్శ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
- జూబ్లీహిల్స్ లోని జూబ్లీ క్లబ్‌లో చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- మహబూబ్ నగర్ లో డీకే అరుణ, వంశీచందర్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు
- మలక్ పేట ముసారాం బాగ్ సలీంనగర్ లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- కాచిగూడ లోని దీక్ష మోడల్ హైస్కూల్ లో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిఓటు వేశారు.
- హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత ఓటు వేశారు.
- మంచిర్యాలలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజా వివేక్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- జూబ్లీహిల్స్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ హీరో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలను అన్ని రకాలుగా చెకింగ్ చేసిన తర్వాత 1,05,019 బ్యాలెట్‌యూనిట్లు, 44,569 కంట్రోల్యూనిట్లు, 48,134 వీవీప్యాట్లు పోలింగ్ కోసం సిద్ధం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.