T20 World Cup: ఆస్ట్రేలియాను ర్యాగింగ్ చేస్తున్న ఐస్లాండ్.. కామెడీ మామూలుగా లేదుగా..!

T20 World Cup: ఆస్ట్రేలియాను ర్యాగింగ్ చేస్తున్న ఐస్లాండ్.. కామెడీ మామూలుగా లేదుగా..!

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద క్రికెట్ జట్లు ఊహించని విధంగా ఓటములు ఎదుర్కొని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.  ఈ విషయంపై ఐస్లాండ్ క్రికెట్ తమదైన శైలిలో నెట్టింట స్పందించింది. నిన్న (ఫిబ్రవరి 17న) ఐర్లాండ్–జింబాబ్వే మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో జింబాబ్వే సూపర్–8కు అర్హత సాధించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మెగా ఈవెంట్ నుంచి ఔట్ అయింది.  

ఆస్ట్రేలియా జట్టు సెలెక్షన్‌పై ఐస్లాండ్ క్రికెట్ వ్యంగ్య అస్త్రలు సంధించింది. గాయపడిన జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో చివరి నిమిషంలో తుది జట్టులోకి స్టీవ్ స్మిత్‌ను తీసుకున్నారు. కీలక మ్యాచ్‌లో అతనికి టీం యాజమాన్యం అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఈ మధ్య వరుసగా బ్యాటింగ్ లో విఫలమవుతున్నా స్మిత్ ని కేవలం బెంచ్‌కే పరిమితమవ్వడం చేయడం విమర్శలకు దారి తీసింది. దీనిపై ఐస్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో సరదాగా ఇలా రాసుకొచ్చింది.. స్టీవ్ స్మిత్‌కు ఈ టీ20 వరల్డ్‌కప్‌లో దొరికిన గొప్ప అనుభవం ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాపే.. మేమైతే అతనికి విగ్రహం కట్టి, జీవితాంతం ఉచిత చేపలు చేస్తామని పేర్కొన్నారు. కొన్ని సార్లు జట్టుకు ముఖ్యమైన ఆటగాళ్లనే మర్చిపోతారు అంటూ సెటైర్లు వేసింది. 

హాస్యాన్ని పక్కన పెడితే, ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన మాత్రం ఈ మెగా టోర్నమెంట్ లో తీవ్రంగా నిరాశ కలిగించింది. ఇది వారి చరిత్రలో గ్రూప్ దశలోనే రెండోసారి నిష్క్రమించింది. జింబాబ్వేపై ఎదురైన అనుహ్య ఓటమి, శ్రీలంక చేతలో 8 వికెట్ల తేడాతో వచ్చిన పరాజయం జట్టును బాగా దెబ్బతీశాయి. మొత్తానికి, ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడంతో సెలెక్షన్ కమిటీ తప్పిదాలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.