చెప్పులు వేసుకుని కార్ డ్రైవింగ్ చేస్తే చలాన్ కట్టాల్సిందేనా..! ట్రాఫిక్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

చెప్పులు వేసుకుని కార్ డ్రైవింగ్ చేస్తే చలాన్ కట్టాల్సిందేనా..! ట్రాఫిక్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

చెప్పులు వేసుకుని కార్ డ్రైవింగ్ చేస్తే ఫైన్ పడుతుందా.. చలాన్ కట్టాల్సిందేనా..? ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిస్కషన్ నడుస్తున్న అంశం ఇది. కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గ్రిప్ కోసం ఎలాంటి చెప్పులు వాడాలి..? అసలు వాడాలా వద్దా..? ఏ ఐటమ్స్ పై కఠిన నిబంధనలు ఉన్నాయి.. ఇలాంటి విషయాలపై ఈ మధ్య చర్చ ఎక్కువగా నడుస్తోంది. 

స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే కఠిన నిబంధనలు అమలు అవుతాయనే రూమర్స్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఈ మధ్య వీటిపై చర్చ ఎక్కువగా నడుస్తోంది. కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి రూల్స్ ఉన్నాయని చెప్తుండటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా మంది డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అంతగా అవగాహన ఉండదు. మరోవైపు కొన్ని నిబంధనలు డ్రైవర్లను కన్ఫ్యూజన్ లో నెట్టేస్తుంటాయి. అలాంటి  పరిస్థితే ఇది. 

వాస్తవానికి స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే ఫైన్ విధించాలని చట్టంలో ఎక్కడా లేదు. చెప్పులు వేసుకుని డ్రైవింగ్ చేసిన వారికి చలాన్ విధించాలని మోటార్ వెహికిల్స్ యాక్ట్ లో ఎక్కడా లేదు. అయినప్పటికీ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడంతో వాహనదారుల్లో గందగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

2019 సెప్టెంబర్ నెలలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాంటి రూల్స్ ఏమీ లేవని స్పష్టత ఇచ్చారు. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం.. స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేయడం చట్టపరంగా తప్పుకాదు. అయినప్పటికీ సేఫ్టీ కోసం స్లిప్పర్స్ కు బదులు షూ వేసుకోవాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. 

డ్రైవింగ్ లో షూ  మంచి గ్రిప్ ఇవ్వడంతో పాటు పెడల్స్ కంట్రోల్ చేయడంలో స్లిప్పర్స్ కంటే బాగా ఉపయోగపడతాయి. సడెన్ బ్రేక్ వేసినప్పుడు చాలా సేఫ్ గా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు సరైన చెప్పులు కూడా పెడల్స్ కు గ్రిప్ ఇస్తుంటాయి. మరోవైపు స్లిప్పర్స్ జారిపోవడం, ఒకవైపు కాలును స్లిప్ అయ్యేలా చేయడం, ఒక్కోసారి స్టక్ అయిపోవడం.. మొదలైన సమస్యలు వస్తుంటాయి. కొన్ని సార్లు ఇది తీవ్ర ప్రమాదాలకు కారణమవుతుంది. రోడ్డు కండిషన్ బాగాలేనప్పుడు ఇది ప్రమాదాలకు కారణమవుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.  

రోడ్డు ట్రాన్స్ పోర్ట్ చట్టాల్లో స్లిప్పర్స్ ను నిషేధించనప్పటికీ.. వాహనదారులు తమ సేఫ్టీ కోసం మంచి షూ వినియోగించాల్సిందిగా చెబుతున్నారు. చెప్పులతో పోల్చినప్పుడు షూ మంచి ఆప్షన్ అని చెబుతున్నారు.