Jr NTR Evening Snack: ఫైవ్‌స్టార్ ఫుడ్ కంటే.. ఆ సింపుల్ స్నాక్ అంటేనే ఇష్టం: జూ.ఎన్టీఆర్‌

Jr NTR Evening Snack: ఫైవ్‌స్టార్ ఫుడ్ కంటే.. ఆ సింపుల్ స్నాక్ అంటేనే ఇష్టం: జూ.ఎన్టీఆర్‌

సౌత్ ఇండియన్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రోజు సాయంత్రం తినే ఇష్టమైన స్నాక్ ఏంటనేది వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అత్యంత ఇష్టమైన సాయంత్రపు స్నాక్ పునుగులు (Punugulu) అని వెల్లడించారు. Esquire Magazineకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

“హైదరాబాద్‌లో దీనిని పునుగులు అంటారు. ఇవి చిన్న భజ్జీలలా ఉంటాయి. అల్లం పచ్చడి, పల్లీ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి,” అని ఎన్టీఆర్ చెప్పారు. పునుగులు సాధారణంగా ఇడ్లీ లేదా దోసె పిండితో తయారుచేసే సంప్రదాయ దక్షిణ భారత వంటకం. బయట కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే ఈ స్నాక్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా లభిస్తుందని ఎన్టీఆర్ వెల్లడించారు. 

పునుగులు అంటే ఏమిటి?

పునుగులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక ప్రసిద్ధ తినుబండారం. ముఖ్యంగా Hyderabadలో వీటికి ప్రత్యేకమైన ఆదరణ ఉంది. బయటకు చిన్న గుండ్రని బజ్జీలలా కనిపించినా, వీటి ప్రత్యేకత వాటి మిశ్రమంలో ఉంటుంది.

సాధారణంగా మిగిలిన ఇడ్లీ లేదా దోసె పిండిని ఉపయోగించి పునుగులు తయారు చేస్తారు. కొద్దిగా పులిసిన ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వంటివి కలిపి రుచిని పెంచుతారు.

ఎలా తయారు చేస్తారు?

తయారైన గట్టిగా ఉన్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని వేడి నూనెలో వేయించి బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తారు. బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండే ఈ పునుగులు వేడివేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి. కొబ్బరి పచ్చడి, పల్లీ పచ్చడి లేదా కారం కలిసిన అల్లం పచ్చడితో తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

అయితే, ఇది సాధారణమైన వంటకం అయినప్పటికీ, పునుగులు దక్షిణ భారతీయ ఇంటింటా ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. ఈ సందర్భంగా స్టార్ హీరో అయినా ఎన్టీఆర్ కూడా ఇదే వంటకాన్ని తన ఇష్టమైన సాయంత్రపు స్నాక్ అని చెప్పడంతో ఫ్యాన్స్ దంచేస్తున్నారు.