డిన్నర్ తిన్నాక ఎందుకు నడవాలి? రాత్రిపూట తిన్న తరువాత ఓ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందా.. న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో పరిశోధ కులు ఏమంటున్నారు. తిన్న వెంటను బెడ: ఎక్కితే ఏమైనా ప్రమాదమా.. ఒటాగో పరిశోధ కుల నివేదికలో ఏముందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
రాత్రి భోజనం చేసిన వెంటనే మంచం ఎక్కుతున్నరా? అయితే ఈ వార్త మీ కోసమే! న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో పరిశోధ కులు జరిపిన తాజా అధ్యయనంలో డిన్నర్ తర్వాత 15 నిమిషాలు నడిస్తే యుక్త వయసు వాళ్లు టైప్ 2 డయా బెటిస్ వ్యాధి బారిన పడకుండా కాపాడకోవచ్చని తేలింది.
పగటి వేళ 45 నిమిషాల నడకకు ఇది సమానమని పరిశోధకులు అం టున్నారు. 'అధిక శాతం మంది రాత్రే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. తిన్న వెంటనే టీవీ ముందు కూర్చొవడమో లేక నిద్రలోకి జారుకోవడమో చేస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్ కి దారి తీస్తుంది .
ALSO READ : అవునా.. నిజమా..ఐస్క్యూబ్స్ కొవ్వును కరిగించి.. బరువును తగ్గిస్తాయా..?
అలాగే 'నడుస్తున్నప్పుడు కండరాలు శక్తి కోసం గ్లూకోజ్ ని వినియోగించుకుం టాయి. అప్పుడు శరీరంలో ఎక్కువ మొత్తంలో సర్క్యూలేట్ అవుతున్న గ్లూకోజ్ తగ్గుతుందని అధ్యయనం లో వెల్లడైంది.
