Heart Health:   గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇదే..!

Heart Health:   గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇదే..!

ఈ మధ్యకాలంలో చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.  ఓ పక్క టెన్షన్​.. పని ఒత్తిడి..ఇలా ఏదైతేనేం వ్యాయామాలకు దూరమవుతున్నారు.  ఏదో కొద్ది సేపు ఫోన్​ చేత్తో పట్టుకొని అటూ ఇటూ గిరా గిరా తిరుగుతున్నారు.  అయినా హార్ట్​ సేఫ్​ గా ఉండటం లేదు.  కాని  అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఎక్స్​పర్​ మెంట్​ లో డైలీ ఓ నలభై పుషప్స్​ చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని తేల్చారు. 

మీరు పుషప్స్ చేస్తారా? చేస్తే డైలీ ఓ  నలభై పుషప్స్​ చెయ్యగలరా? చెయ్య గలిగితే మీ గుండె సేఫ్ అనే లెక్క. రోజుకు 40 పుష్ అప్స్ చేసే వాళ్లకు 96 శాతం గుండెపోటు వచ్చే అవకాశం లేదని తాజా అధ్యయనంలో కనుగొన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ
అధ్యయనం చేపట్టారు.

దీని కోసం 1104 మంది ఫైర్ ఫైటర్లని పదేళ్లపాటు వారి ఎక్సర్​సైజ్ ఆధారంగా పరీక్షించారు. రోజూ 40 పుష్ అప్స్ చేస్తే మంచిదని, కనీసం 10 పుష్ అప్స్ చేసినా కొంతవరకు గుండె సంబంధిత వ్యాధులు అడ్డుకోవచ్చని గుర్తించారు. పుషప్స్​ సులువైన, ఖర్చులేని ఎక్సర్సైజ్ అని రోజూ చేసేందుకు ప్రయత్నించాలని పరిశో ధకులు సూచించారు.

ALSO READ : రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే.. షుగర్ రాకుండా ఉంటుందా..!

ప్రపంచంలో ఎక్కువ మరణాలకు కారణమవుతున్న వాటిలో గుండెపోటు ఒకటి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా అడ్డుకోవడానికి నడక మంచి మార్గం అని చాలాకాలంగా డాక్టర్లు సూచిస్తున్నారు. తాజా అధ్యయనంతో పుషప్స్​ చెయ్యడం వల్ల కూడా గుండె మరింత సేఫ్ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.