ఢిల్లీ వచ్చే వారికి వారం రోజులు క్వారంటైన్ కంపల్సరీ

ఢిల్లీ వచ్చే వారికి వారం రోజులు క్వారంటైన్ కంపల్సరీ
  • వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం
  • విమానాలు, రైళ్లు, బస్సుల్లో వచ్చేవారికి తప్పనిసరి అని ఉత్తర్వులు

న్యూఢిల్లీ: విమానాలు, రైళ్లు, బస్సుల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారందరికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి అని సీఎం కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఈ నిబంధనను అమలు చేయాల్సిన బాధ్యతలు జిల్లా పరిపాలన అధికారులకు చేపట్టాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మినహా ప్రతిఒక్కరికి క్వారంటైన్ అవసరం లేదంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పోయిన వారంలో వరుసగా సడలింపులు అమల్లోకి రావడంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే బార్డర్స్ వారం పాటు మూసివేసి ఉంచుతామని ప్రకటించింన సీఎం కేజ్రీవాల్ .. ప్రజల నుంచి సలహాలు కోరిన తర్వాత ఓపెన్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో 23,645 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. గడిచిన వారంలో రోజుకు సగటు 1,200 కొత్త కేసులు నమోదయ్యాయి.