మహిళా సంఘం నుంచి.. సివిల్ జడ్జిగా ఎంపికైన తొలి గిరిజన మహిళ శ్రీపతి

మహిళా సంఘం నుంచి.. సివిల్ జడ్జిగా ఎంపికైన తొలి గిరిజన మహిళ శ్రీపతి

తమిళనాడులోని మలయాళీ తెగకు చెందిన 23 యేళ్ల యువతి తొలి సివిల్ కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తిరుపత్తూరు జిల్లాలోని ఏలగిరి హిల్స్ కు చెందిన వి. శ్రీపతి.. టీఎన్పీఎస్సీ నిర్వహించిన సివిల్ జడ్జీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తిరువన్ణామలైలో మహిళా సంఘం నుంచి సివిల్ జడ్జిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. తిరువన్ణామలైలోని రిజర్వ్ డ్ ఫారెస్ట్ సరిహద్దులోని తువింజికుప్పంలో జన్మించింది శ్రీపతి.. కాలియప్పన్, మల్లిగ దంపతులకు పెద్ద కుమార్తె. 

శ్రీపతి సాధించినవిజయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కొనియాడారు. సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ నిరుపేద కొండ గ్రామానికి చెందిన గిరిజన బాలిక ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

జడ్జిగా శ్రీపతి ఎంపిక తమిళ విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే మా ప్రభుత్వ నిబద్ధతను చాటి చెప్తుంది.. మద్దతుగా నిలిచిన ఆమె తల్లి, భరతకు అభినందనలు అని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా శ్రీపతి సంకల్పాన్ని అభినందించారు. మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సిస్టర్ శ్రీపతి జడ్జిగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రసవం తర్వాత రెండు రోజులకే పరీక్షకు హాజరు కావడం వంటి సవాళ్లను అధిగమించి ఆమె విజయం సాధించడం ..ఆమె పట్టుదల ప్రశంసనీయం అన్నారు ఉదయనిధి స్టాలిన్ .