ఎకానమీ బూస్టింగ్​కు ఆరు పిల్లర్ల ఫార్ములా డీటేల్స్…

ఎకానమీ బూస్టింగ్​కు ఆరు పిల్లర్ల ఫార్ములా డీటేల్స్…
  • 34 లక్షల 83వేల 236 కోట్లతో భారీ బడ్జెట్
  • ‘క్లీన్​ ఇండియా.. హెల్తీ ఇండియా’కు పెద్ద పీట

కరోనా ఎఫెక్ట్​తో దెబ్బతిన్న ఎకానమీని గాడిలో పెట్టే పని చేశారు నిర్మలమ్మ. పన్నుల బాదుడు లేకుండా అన్ని రంగాలకు బూస్టప్​ ఇచ్చేలా సోమవారం పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టారు. ‘క్లీన్​ ఇండియా.. హెల్తీ ఇండియా’, ‘సంకల్ప్​ ఆఫ్​ నేషన్​ ఫస్ట్’ నినాదాలతో 2021‌‌-22 ఫైనాన్స్​ ఇయర్​కు ఆరు పిల్లర్ల ఫార్ములా ప్రకటించారు. దాని ఆధారంగా కేటాయింపులు జరిపారు. పబ్లిక్​ హెల్త్​కు పెద్ద పీట వేశారు. సాగుకు సాతిచ్చారు. ఇల్లు కట్టుకునెటోళ్లకు గతంలోని లోన్​ రిలాక్సేషన్స్​ కొనసాగుతాయని చెప్పారు. ట్యాక్స్​ పేయర్లకు కూడా పాత శ్లాబులే అమలు కానున్నాయి. కాలుష్యం, రోడ్డు ప్రమాదాలకు చెక్​ పెట్టేందుకు ‘స్క్రాపేజీ పాలసీ’ని ప్రకటించారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్,  రైల్వే​, పబ్లిక్​ ట్రాన్స్​పోర్టు, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, ఎడ్యుకేషన్​, డిఫెన్స్​.. ఇట్ల ప్రతి సెక్టార్​కు ప్రయార్టీ ఇచ్చారు. బీమా రంగంలో మరిన్ని  సంస్కరణలకు తెరతీస్తూ.. 49 శాతం ఉన్న ఎఫ్​డీఐలను 74 శాతానికి పెంచారు. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతోపాటు ఎల్​ఐసీని ఐపీవోకి తెస్తామన్నారు. పెట్రోల్​, డీజిల్​పై అగ్రి ఇన్​ఫ్రా సెస్​ వేశారు. అయితే.. అది కస్టమర్స్​పై ఎఫెక్ట్​ చూపదని చెప్పారు. మొత్తంగా గంటా 50 నిమిషాల పాటు సాగిన ఫైనాన్స్​ మినిస్టర్​ బడ్జెట్​ నచ్చడంతో స్టాక్​ మార్కెట్లు రాకెట్లా దూసుకుపోయాయి. 

ఆరోగ్యం & శ్రేయస్సు

  • పీఎం ఆత్మనిర్భర్​ స్వాస్థ్‌ యోజన ను కేంద్రం లాంచ్​ చేసింది. ఈ పథకానికి రూ.64  వేల కోట్లు కేటాయించింది.
  • జల్​ జీవన్​ మిషన్​ అర్బన్​ స్కీమ్​ను ప్రారంభించింది.
  • అర్బన్​ స్వచ్ఛ భారత్​ మిషన్​ 2.0ను కూడా లాంచ్​ చేసింది.
  • పొల్యూషన్​ను తగ్గించేం దుకు వాలంటరీ వెహికల్​ స్క్రాపింగ్​ పాలసీని మొదలుపెట్టింది.
  • ఏటా 50 వేల మంది చిన్నారుల మరణా లను తగ్గించేందుకు న్యుమోకోకల్​ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం.
  • మిషన్​ పోషన్‌ 2.0 లాంచ్​ చేశారు
  • సప్లిమెంటరీ న్యూట్రిషన్​ ప్రోగ్రామ్ & పోషణ్‌​ అభియా న్‌‌ల విలీనం.

పెట్టుబడులు &మౌలిక వసతులు

  • మెగా ఇన్వెస్ట్​మెంట్​ టెక్స్​టైల్​ పార్క్స్​కోసం ప్రత్యేక స్కీమ్​ను తీసుకురావడం.
  • పీఎల్ఐ స్కీమ్​నులాంచ్​ చేయడం.
  • వచ్చే మూడేండ్లలో 7 టెక్స్​టైల్​ పార్క్స్​ను ఏర్పాటు.
  • ఇన్​ఫ్రా ఫైనాన్సింగ్​ కోసం డెవలప్​మెంట్​ ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్​ ఏర్పాటు. చేయడం. ఇందుకు రూ.20 వేల కోట్లు కేటాయింపు.
  • 2022 జూన్​ నాటికి వెస్ట్రన్​ రవాణా కారిడార్, ఈస్టర్న్​ రవాణా కారిడార్​ను ప్రారంభించడం.
  • 2023 డిసెంబర్​ నాటికి రైల్​ బ్రాడ్​గేజ్​​ రూట్లను వంద శాతం ఎలక్ట్రిఫికేషన్​ పూర్తి చేయడం.
  • పబ్లిక్​ బస్​ ట్రాన్స్​ పోర్ట్​ కోసం 18 వేల కోట్లతో స్కీమ్
  • పీపీపీ పద్ధతిలో రూ.2 వేల కోట్లతో 7 పోర్ట్​ ప్రాజెక్టులు
  • 2024 నాటికి షిప్​ రీసైక్లింగ్​ కెపాసిటీని రెట్టింపు చేయడం
  • సిటీ గ్యాస్​ డిస్ట్రిబ్యూషన్​ నెట్​వర్క్​లోకి మూడేండ్లలో మరో వంద జిల్లాలను తీసుకురావడం
  • ఇన్సూరెన్స్​ యాక్ట్​ 1938కి సవరణలు చేసి ఇన్సూరెన్స్​ కంపెనీల్లో ఎఫ్​డీఐలను 49  నుంచి 74 శాతానికి పెంచడం.
  • బ్యాంక్​ కస్టమర్లకు డిపాజిట్​ ఇన్సూరెన్స్ కవర్​ను లక్ష నుంచి  5 లక్షలకు  పెంచడం
  • ఎన్​సీఎల్టీ ఫ్రేమ్​వర్క్​ను బలోపేతం చేయడం, ఈ కోర్ట్​ సిస్టంను అమలులోకి తేవడం.
  • ఎల్​ఐసీ ఐపీవోను అందుబాటులోకి తేవడం, 2021–22 నాటికి ఐడీబీఐ, ఎయిరిండియా డిస్ ఇన్వెస్ట్​మెంట్​ను పూర్తి చేయడం.

అన్ని రంగాల్లో ప్రగతి

  • స్వామిత్వ స్కీమ్​ను 2021–22 ఆర్థిక సంవత్సరానికి పొడిగించారు. అన్ని రాష్ట్రాలు, ఈ స్కీమ్​ కవర్​ అవుతుంది.
  • అగ్రికల్చర్​ క్రెడిట్​ టార్గెట్​ను రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. డైరీ, ఫిషరీస్ సెక్టార్లపై ఫోకస్​ చేస్తారు.
  • రూరల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​కు కేటాయింపులను రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు.
  • మైక్రో ఇరిగేషన్​ ఫండ్​కు అదనంగా 5 వేల కోట్లు
  • ఈ–నామ్​లోకి మరో వెయ్యి మండీలను చేర్చడం
  • అగ్రికల్చర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫండ్​ను ఏపీఎంసీలు వాడుకునే వీలు
  • కొచ్చి, చెన్నై, వైజాగ్, పారాదీప్, పెతువాఘాట్​ల్లో ఐదు మేజర్ ఫిషింగ్​ హార్బర్లను అభివృద్ధి చేయడం.
  • బిల్డింగ్, కనస్ట్రక్షన్, ఇతర వర్కర్లకు హెల్త్​, హౌసింగ్, ఇన్స్యూరెన్స్, క్రెడిట్, ఫుడ్​ స్కీమ్​లు అందేలా ప్రత్యేక పోర్టల్​ ఏర్పాటు చేసి.. వలస కార్మికుల వివరాల సేకరణ.
  • అన్ని కేటగిరీల వర్కర్లకు కనీస వేతనం వర్తింపు. వారందరికీ ఈఎస్​ఐ వర్తింపజేయడం
  •  అన్ని కేటగిరీల్లో మహిళలు పనిచేసేందుకు అనుమతి. నైట్​ షిఫ్ట్​ల్లో అవసరమైన రక్షణ చర్యలు కల్పించడం
  • ఎంఎస్ఎంఈ సెక్టార్​కు రూ.15,700 కోట్లు

మానవ వనరుల బలోపేతం

  •  చిన్నారులకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించేలా దేశంలోని దాదాపు 15 వేల స్కూళ్లను బలోపేతం.
  • దేశవ్యాప్తంగా కొత్తగా వంద సైనిక్‌‌ స్కూళ్ల ఏర్పాటు
  • హయ్యర్​ ఎడ్యుకేషన్​కు ప్రోత్సాహం అందించేలా అంబ్రెల్లా బాడీని ఏర్పాటు చేయడానికి చట్టం.
  • లేహ్​లో సెంట్రల్​ యూనివర్సిటీ ఏర్పాటు

ఇన్నోవేషన్, రీసెర్చ్ & డెవలప్​మెంట్

  • నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ కోసం ఐదేండ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • డిజిటల్​ మోడ్​లో చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఫైనాన్షియల్​ ఇన్​సెంటివ్స్​ అందించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక స్కీమ్​ను తీసుకువస్తారు.
  • నేషనల్​ లాంగ్వేజ్​ ట్రాన్స్​లేషన్​ మిషన్(ఎన్టీఎల్ఎం) ను లాంచ్​ చేస్తారు.
  • గగన్​ యాన్​ మిషన్​ను ముందుకు తీసుకెళ్తారు. నలుగురు ఇండియన్స్​ఆస్ట్రోనాట్స్​కు స్పేస్​లో పరిస్థితులపై రష్యాలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. 2021     డిసెంబర్​లో మానవరహిత మిషన్​ను లాంచ్​ చేస్తారు.
  • సముద్ర గర్భంలోని అరుదైన జీవజాలాన్ని కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. రూ.4 వేల కోట్లతో ఐదేండ్ల పాటు సముద్ర గర్భంలో సర్వే నిర్వహిస్తారు.

మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమం గవర్నెన్స్

  • నేషనల్​ నర్సింగ్ బిల్లును త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
  • కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మెకానిజంను అందుబాటులోకి తేవడం.
  • జనాభా లెక్కలను తొలిసారిగా పూర్తి డిజిటల్​ పద్ధతిలో చేపట్టడం. 2021–22 కోసం రూ.3,768 కోట్ల కేటాయింపు.
  • పోర్చుగీస్​ పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన గోవా డైమండ్​ జూబ్లీ వేడుకల కోసం రూ.300 కోట్ల కేటాయింపు.
  • అస్సాం, వెస్ట్​ బెంగాల్​లోని టీ వర్కర్లు.. ముఖ్యంగా మహిళలు, వారి పిల్లల సంక్షేమం కోసం రూ.1,000 కోట్ల కేటాయింపు