అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ఫొటోస్

అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ఫొటోస్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్(Aamir khan) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఐరా ఖాన్(Ira khan), నుపుర్ శిఖరే(Nupur Shikhare)ను వివాహం చేసుకోనున్నారు. గత ఏడాది నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగగా.. వచ్చే ఏడాది జనవరి 3న పెళ్లి జరగనుంది. దీంతో పెళ్ళికి రెండు నెలల రెండు నెలలు ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పోటోలను ఐరా ఖాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవికాస్తా వైరల్ గా మారాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

ఇక ఐరా ఖాన్, నుపుర్ శిఖరే విషయానికి వస్తే.. ఈ జంట గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరి అభిప్రాయాలు కలువడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటికానున్నారు.