ఆమీర్‌‌‌‌ ఖాన్ కొత్త సినిమా పేరు సితారే జమీన్ పర్

ఆమీర్‌‌‌‌ ఖాన్ కొత్త సినిమా పేరు సితారే జమీన్ పర్

‘లాల్ సింగ్ చడ్డా’ తర్వాత ఏడాదికిపైగా గ్యాప్ తీసుకున్న ఆమీర్‌‌‌‌ ఖాన్.. తాజాగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘సితారే జమీన్ పర్‌‌‌‌’ టైటిల్‌‌తో ఈ సినిమా ఉండబోతోందని ఆయన చెప్పారు. 2007లో తను నటిస్తూ, డైరెక్ట్ చేసిన ‘తారే జమీన్ పర్‌‌‌‌’ సినిమా తరహాలోనే ఇది ఉండబోతోంది. ఈ చిత్రం గురించి ఎక్కువగా తాను చెప్పనని, కానీ టైటిల్‌‌ మాత్రం చెబుతానంటూ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన రివీల్ చేశారు.

‘‘తారే జమీన్ పర్’ ఎమోషనల్ మూవీ.. ఏడిపించింది. కానీ ఇది ఎంటర్‌‌‌‌టైనర్.. నవ్విస్తుంది. అందులో ఇషాన్ అనే ప్రత్యేకమైన పిల్లాడికి సాయం చేశాను. ఇందులో అలాంటి తొమ్మిది మంది పిల్లలకు సాయం చేస్తా’ అని ఆమీర్ చెప్పారు. మరోవైపు నుపుర్ శిఖరే తో తన కూతురు ఐరా ఖాన్ పెళ్లి.. వచ్చే ఏడాది జనవరి 3న జరుపబో తున్నట్టు ఆమీర్ ఖాన్ ప్రకటించారు.