రాఘవ్ చద్దా, పరిణీతి రిలేషన్ పై క్లారిటీ వచ్చేసింది

రాఘవ్ చద్దా, పరిణీతి రిలేషన్ పై క్లారిటీ వచ్చేసింది


బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా,  ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన  సంగతి తెలిసిందే. దీనిపై మీడియా అడిగితే సమాధానం దాటేసుకుంటూ వచ్చారు రాఘవ్ చద్దా. అయితే వీరిద్దరికి మరో ఆప్  ఎంపీ సంజీవ్ ఆరోరా శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. " రాఘవ్ చద్దా, పరిణీతికి నా అభినందనలు, వారికి నా శుభాకాంక్షలు" అంటూ సంజీవ్ ఆరోరా ట్వీట్ చేశారు. దీంతో రాఘవ్ చద్దా, పరిణీతి ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  రాఘవ్ చద్దా, పరిణీతి  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. 

https://twitter.com/MP_SanjeevArora/status/1640598560457764864

ఇటీవలే ముంబైలోని ఓ ఓ రెస్టారెంట్ లో డిన్న ర్ చేస్తూ వీరిద్దరూ మీడియా కంటపడ్డారు. ఆ త‌ర్వాత మార్చి 23న  ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ పాల్గొనడమే కాకుండా.. ఒకే కారులో వెళ్లిపోవడం అటు సినీ వర్గా్ల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది. ఈ సంఘటనలతో రాఘ‌వ్ చ‌ద్దాతో ప‌రిణీతి చోప్రా రిలేషన్లో ఉన్నది నిజ‌మేనంటూ ప్రచారం మొద‌లైంది.

2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె ‘చమ్కిలా’, ‘క్యాప్సూల్ గిల్’ చిత్రాలలో నటిస్తోంది.