నేడు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు 11వ పుట్టిన రోజు

నేడు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు 11వ పుట్టిన రోజు

బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ముద్దుల కూతురు, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ల మనువరాలు ఆరాధ్య బచ్చన్ ఈ రోజు పుట్టిన రోజు నిర్వహించుకుంటోంది. 11వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ కిడ్ 2011 నవంబర్ 16న జన్మించింది. 

ఆరాధ్య.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు నుంచే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని, అభిమానుల్ని సొంతం చేసుకుంది. స్టార్ ఫ్యామిలీ ఇమేజ్ ఒక ఎతైతే, తల్లిని పోలిన గ్లామర్ ఇంకో ఎత్తు. ఇలా సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఒక్క సినిమాలో నటించకపోయినా, తల్లితో పాటు పలు ఫ్యాషన్ షోలకు, అవార్డ్ ఫంక్షన్లకు వెళ్తూ అందరికీ పరిచయమైంది. ఐశ్వర్యరాయ్ కూడా కూతురు ఆరాధ్యతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ అభిమానులకు దగ్గర చేస్తుంది. 

ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్.. ఆరాధ్యతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ఆరాధ్యకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.