65 శాతం కరోనా కేసులు మహారాష్ట్రలోనే

65 శాతం కరోనా కేసులు మహారాష్ట్రలోనే

ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నా మన దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి...ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత భారీ స్థాయిలో ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు  65 శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 35,871 కేసులు నమోదు కాగా... ఇందులో 23,179 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.