సార్లు వస్తలేరు : డుమ్మా మాస్టర్లపై విద్యాశాఖ చర్యలు

సార్లు వస్తలేరు : డుమ్మా మాస్టర్లపై విద్యాశాఖ చర్యలు

ప్రభుత్వ స్కూల్స్ ని ప్రవేట్ స్కూల్స్ కి దీటుగా టీచింగ్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ..ఉపాధ్యాయులు మాత్రం ఈ మాటలను ఏ మాత్రం లెక్క చేయడంలేదు. వచ్చామా, వెళ్లామా అనే రీతిలోనే ఉన్నారు. టైముకు సాలరీ పడిందా అంతే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల రాష్ట్రంలోని స్కూల్స్ లో డుమ్మా కొడుతున్న టీచర్ల వివరాలను సేకరించింది విద్యాశాఖ. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు డుమ్మాకొడుతున్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది.

ఇప్పటివరకు 25 జిల్లాల్లో ఇలాంటి 106 మందిని గుర్తించగా..వారిలో 15 మంది ఒక్క రంగారెడ్డిలోనే ఉన్నారు. మొత్తం లాంగ్ లీవ్ ఉపాధ్యాయుల్లో 5 ఏళ్ల నుంచి విధులకు రానివారు 22 మంది ఉండటం గమనార్హం. కొంతమంది టీచర్లు లేటుగా వచ్చి హాజరు వేసుకుని త్వరగా వెళ్తారని తేలింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న వీరందరిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపింది విద్యాశాఖ. దూరం నుంచి వచ్చే టీచర్లు అవసరమైతే స్కూల్ ఉన్న గ్రామంలోనే ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.