రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఆరంగర్ నుంచి మెహదీపట్నంకు వెళ్తుండగా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 150 రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న బీహార్ కు చెందిన ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు.
స్థానికులు యాక్సిడెంట్ ను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డెడ్ బాడీని రికవరీ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
