బండల మల్లన్న జాతర పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బండల మల్లన్న జాతర పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

అమీన్​పూర్, వెలుగు: పటాన్​చెరు డివిజన్​ పరిధిలోని ఆల్విన్​ కాలనీ బండల మల్లన్న జాతర మహోత్సవ పోస్టర్​ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో పటాన్​చెరు కార్పొరేటర్​ మెట్టు కుమార్​యాదవ్​, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్​, గూడెం మధుసూదన్​రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మల్లేశ్​యాదవ్​, సభ్యులు పాల్గొన్నారు.  

కాలనీ సమస్యలు పరిష్కరిస్తా

 అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్​ కాలనీలోని సమస్యలను ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్​ మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ వైస్​ చైర్మన్​ నర్సింహాగౌడ్​తో కలిసి కాలనీ వాసులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

కాలనీ వాసుల వినతి మేరకు త్వరలోనే డ్రైనేజీ, స్ట్రీట్​ లైట్లు  ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్​ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు శ్రీకాంత్​, శ్రీనివాస్​రెడ్డి, కొల్లూరు యాదగిరి, జ్ఞాణేశ్వర్​, కాలనీ అధ్యక్షుడు గోపీనాథ్​రెడ్డి పాల్గొన్నారు.  

అథ్లెటిక్స్​ పోటీలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

మాస్టర్స్​ అథ్లెటిక్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో కరీంనగర్​ కేంద్రంగా జరుగనున్న క్రీడలో పాల్గొంటున్న సంగారెడ్డి జిల్లా జట్టుకు లక్షాయాభై వేలు ఆర్థిక సాయం చేశారు. ఆదివారం సాయంత్రం పటాన్​చెరు పట్టణంలోని తన నివాసంలో జిల్లా జట్టుకు నగదు అందజేశారు. 

రాష్ర్ట స్థాయి పోటీల్లో సంగారెడ్డి జిల్లా జట్టు ఘన విజయం సాధించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు ఫహీం ఇక్భాల్, కార్యదర్శి సామెల్, క్రీడాకారులు పాల్గొన్నారు.