ఎన్నికల్లో ఓడిపోయినా.. మాట నిలబెట్టుకున్న సర్పంచ్ అభ్యర్థి

ఎన్నికల్లో ఓడిపోయినా.. మాట నిలబెట్టుకున్న సర్పంచ్ అభ్యర్థి

శివ్వంపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ  ఓ సర్పంచ్​ అభ్యర్థి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంఘటన శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో చింతల బస్తీ వాసులు నీటి ఎద్దడి తీర్చాలని బీఆర్​ఎస్​మద్దతుతో సర్పంచ్​పదవికి పోటీచేసిన అభ్యర్థి సుశీల బాబును కోరారు. అందుకు స్పందించిన ఆమె తాను సర్పంచ్ గా గెలవగానే ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం శనివారం రాత్రి సుశీల బాబు సొంత డబ్బులతో బోరు తవ్వించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుకుమార్,  సుజాత, రమేశ్, మమత కృష్ణ , రాములు, స్వామి, మండల పరిషత్ మాజీ  కో ఆప్షన్ మెంబర్​ లాయక్, నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, అనిల్  పాల్గొన్నారు.