మూడేళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లు అలాగే ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు సిట్యువేషన్ మారింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా అనే సందేహాలకు.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ నెల రోజులు అంటే.. 2026, మార్చి నెలలో మాత్రం పెట్రోల్, డిజిల్ రేట్లు పెరగవు అని చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. మార్చి నెలలో ఇంధన ధరలు పెరగవు అంటే.. ఏప్రిల్ నెలలో ధరలు పెరుగుతాయా.. ఏప్రిల్ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు కొరత ఏర్పడుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం.. యుద్ధం.. ఇరాన్ యుద్దం.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో కొట్లాడుతున్న ఇరాన్.. ఆ రెండు దేశాలకు సపోర్ట్ చేస్తు్న్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాలకు ఆయువు పట్టు.. ఆర్థిక శక్తి అయిన ఆయిల్ బావులను.. ఆయిల్ కంపెనీలపై బాంబులతో విరుచుకుపడుతుంది ఇరాన్ దేశం.
నిన్నటికి నిన్న సౌదీలోని ఆరాంకో ఆయిల్ ఫ్యాక్టరీని పేల్చేసిన ఇరాన్.. లేటెస్ట్గా అంటే.. 3వ తేదీ ఒమన్లోని ఆయిల్ బావులపై బాంబులు వేసింది. దీనికితోడు గల్ఫ్, పశ్చిమాసియా దేశాల నుంచి ఇండియాకు వచ్చే ఆయిల్ నౌకల మార్గం అయిన హర్మజ్ జల సంధిపైనా ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో 3 రోజులుగా ఈ మార్గంలో ఇంధన నౌకలు తిరగడం లేదు.. మరో వైపు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతి జరగటం లేదు.
►ALSO READ | రేయ్.. అది బండి అనుకున్నారా బస్ అనుకున్నారా..! అసలు ఇలాంటోళ్లని ఏం చేయాలి
ఈ పరిణామాలన్నీ ఇండియాకు శాపంగా మారబోతున్నాయి. ఎందుకంటే.. ఇండియాలో మనం వాడుకునే పెట్రోల్, డీజిల్ 85 శాతం గల్ప్, రష్యా, వెనిజులా నుంచే వస్తోంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆయిల్ నిల్వలు.. జస్ట్ 25 రోజులు మాత్రమే వస్తాయి. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది.. మరో 20 రోజుల్లో మన స్టాక్ అయిపోతుంది.. అప్పుడు ఏం చేయాలి.. ఇండియా ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
