రేయ్.. అది బండి అనుకున్నారా బస్ అనుకున్నారా..! అసలు ఇలాంటోళ్లని ఏం చేయాలి

రేయ్.. అది బండి అనుకున్నారా బస్ అనుకున్నారా..! అసలు ఇలాంటోళ్లని ఏం చేయాలి

స్కూటీపై ఇద్దరు వెళ్తారు.. కొన్ని సార్లు ముగ్గురు కూడా వెళ్తుంటారు.. కానీ వీళ్లు మాత్రం ఒకేసారి ఆరుగురు ప్రయాణించారు. ఒకడు స్కూటీ ముందు భాగంలో కూర్చొగా.. ఇంకొకడు ఫుట్ రెస్ట్‎పై నిలబడ్డాడు. మరొకడు ప్రమాదకరంగా సైలెన్సర్‎పై నిలబడ్డాడు. ఇక్కడ ఆగ్రహం తెప్పించే మరో విషయం ఏంటంటే వీరంతా మైనర్లే. ఒక్కడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ చేసే అర్హత లేదు. కనీసం హెల్మెట్ కూడా లేదు. 

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వీళ్ల ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసే విధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో ప్రకారం ఈ ఘటన ముంబైలో నిత్యం ట్రాఫిక్‎తో రద్దీగా ఉండే కుర్లా CST రోడ్డులో జరిగింది. ఒకే స్కూటీపై ఆరుగురు మైనర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఒకరు స్కూటీ ముందు భాగంలో కింద కూర్చొగా .. మరొకరు డ్రైవింగ్ చేశారు. 

►ALSO READ | బిర్యానీ షాపు ఫ్రీజర్‌లో మృతదేహం ! కనిపించకుండా పోయిన వ్యక్తి మూడు రోజులుగా ఫ్రీజర్‌లో ...

మరో ఇద్దరూ వెనక సీటుపై కూర్చుకున్నారు. ఇంకొరు స్కూటీ ఫుట్ రెస్ట్‎పై నిలబడగా.. మరొకరు సైలెన్సర్‎పై కాలు పెట్టి నిలబడ్డాడు. ఆరుగురు ప్రయాణిస్తూ కూడా బండిని వేగంగా డ్రైవ్ చేశారు. ఒక్కరిలో కూడా భయం లేకుండా సరదాగా నవ్వుకుంటూ వెళ్లారు. ఈ వీడియోను ముంబై టీవీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘కుర్లా CST రోడ్డులో ఒకే బండిపై ఆరుగురు యువకులు’ అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

ఈ వైరల్‎గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ వీడియోను పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు. మైనర్లకు బండి ఇచ్చిన వాళ్ల తల్లిదండ్రులపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు. మరికొందరు ఈ వీడియోపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. రేయ్.. అది బండి అనుకుంటున్నారా బస్ అనుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MUMBAI TV (@mumbai_tv)