కాజీపేట రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌ నిధుల స్కాం....సీబీఐ కేసు నమోదు

కాజీపేట రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌ నిధుల స్కాం....సీబీఐ కేసు నమోదు

వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ కుంభకోణంపై  సీబీఐ కేసు నమోదు చేసింది.  ముగ్గురు ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ మెయింటైనర్లు, ఒక సంస్థ సహా 8 మందిపై కేసు నమోదు చేసింది. రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జి.పి. సింగ్ సహా సంధ్యా కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేసింది.  పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు గుర్తించింది.  నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించినట్లు అధికారుల విచారణలో  తేలింది.  

క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే బిల్లులు పాస్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.  కాంట్రాక్టర్ ఖాతాల నుంచి ఇంజనీర్ ఖాతాలకు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.  ట్రాక్ పనులు జరగకపోతే రైల్వే ప్రయాణికుల భద్రతకు ముప్పు ఉందని ఎఫ్ఐఆర్ల్ తో తెలిపింది సీబీఐ.  ఇప్పటికే విచారణకు DOPT, తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకుంది సీబీఐ.  కుట్ర (120B), మోసం (420), అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది సిబిఐ.

►ALSO READ | మంచిర్యాల జిల్లాలో రెండు ఇండ్లు దగ్ధం.. మంటల్లో కరిగిపోయిన అరకిలో వెండి

కాజీపేట నార్త్‌‌‌‌‌‌‌‌  రైల్వే ట్రాక్ సంరక్షణ పనుల్లో అవినీతి, కుట్ర, మోసం జరిగినట్టు గుర్తించింది సీబీఐ. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ట్రాక్ భద్రతా పనుల కాంట్రాక్ట్ ఒప్పందం  కింద పనులు చేపట్టిన సంధ్య కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్ సంస్థ, సంబంధిత రైల్వే అధికారులతో కలిసి మోసానికి పాల్పడినట్టు ఆధారాలు సేకరించింది. మరో కేసులో 2022 నుంచి 2024 మధ్య కాలంలో కాజీపేట, పొటకపల్లి, ఉప్పల్ రైల్వే స్టేషన్ల పరిధిలో భద్రతా ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం కుదిరిన కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లోనూ సంధ్య కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ,  సంబంధిత రైల్వే అధికారితో కలిసి రైల్వేలకు నష్టం కలిగించినట్లు గుర్తించింది.