హసన్ పర్తి,వెలుగు : టీజీసీపీజీసెట్-2026 ఫలితాలను ఆగస్టు 5న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్ రాజేందర్ కట్ల తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
