గ్రీవెన్స్ కు అర్జీల వెల్లువ

గ్రీవెన్స్ కు అర్జీల వెల్లువ

ములుగు/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ ఖమ్మం టౌన్/ ఏటూరునాగారం, వెలుగు :  ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు వివిధ సమస్యలపై 67 అర్జీలు వచ్చాయని కలెక్టర్​బోర్ఖడే హేమంత్​సహదేవరావు తెలిపారు. జనగామలో 326 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్​ సందీప్​కుమార్​ఝా పేర్కొన్నారు. వరంగల్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 153 వినతులు వచ్చాయని కలెక్టర్​సత్యశారద చెప్పారు. 

జయశంకర్​భూపాలపల్లిలో 81 దరఖాస్తులు వవచ్చినట్లు కలెక్టర్​ రాహుల్​శర్మ తెలిపారు. అనంతరం గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయన సమావేశం నిర్వహించి అప్​డేట్స్​ తెలుసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్​లో కలెక్టర్​ దివాకర ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాగా, ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరివాణికి 10 వినతులు వచ్చాయని డిప్యూటీ డైరెక్టర్​ జనార్దన్​తెలిపారు.