స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ. 60 కోట్లు

స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ. 60 కోట్లు

జనగామ, వెలుగు: స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన కలెక్టర్​ సందీప్​కుమార్​ఝాతో కలిసి అభివృద్ధి పనుల పురోగతి, టెండర్ల ప్రక్రియను సమీక్షించారు. టెండర్లు పూర్తైన పనులకు ఈ వారంలోనే ఒప్పందాలు పూర్తి చేసి, తొలి విడత పనులను ఆగస్టు 31లోగా, రెండో విడత పనులను అక్టోబర్ 10లోగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

సీసీ రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, స్టేడియం, ఓపెన్ జిమ్, వెజ్-నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెజ్ మార్కెట్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్తి పన్ను వసూళ్లు, ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అభివృద్ధి, పారిశుధ్యం, పచ్చదనంలో స్పష్టమైన మార్పు కనిపించేలా పనిచేయాలని, ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. మీటింగ్​లో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ నీల రాజమ్మ, ఆర్డీవో కిరణ్ ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.