పండుగ రోజు విషాదం.. సూరారం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

పండుగ రోజు విషాదం.. సూరారం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  సూరారం పోలీస్ స్టేషన్ పరిధి పంతులు చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.

  హోళీ పండగ అనంతరం స్నానం కోసం స్నేహితులతో కలిసి చెరువులోకి దిగారు ఇద్దరు యువకలు .లోతులోకి వెళ్లిన తర్వాత  ఊపిరాడక నీటిలో మునిగి సాగర్(17),అభిషేక్(17) మృతి చెందారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు చెరువులో నుంచి మృతదేహాలను ఒడ్డుకు తీశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అులముకున్నాయి.ఆనందంగా గడవాల్సిన హోలీ పండుగ రోజు ఇలా విషాదం చోటుచేసుకోవడంపై కన్నీరుమున్నీరవుతున్నారు.

►ALSO READ | స్పోర్ట్స్ బైక్ మోజుతో.. డ్యూక్ అద్దెకు తీసుకున్న ఇంటర్ స్టూడెంట్స్... ట్రిపుల్ రైడింగ్ వెళ్లి...