హిడెన్  టాలెంట్

హిడెన్  టాలెంట్

నటిగా దీపిక పదుకొనె టాలెంట్‌‌‌‌ ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే బాలీవుడ్‌‌‌‌తో పాటు ఇంగ్లీష్‌‌‌‌ చిత్రాల్లోనూ ఆమె నటించింది. అయితే యాక్టింగ్, డ్యాన్స్‌‌‌‌తో పాటు మరో టాలెంట్‌‌‌‌ కూడా ఆమెలో ఉంది. తనలో దాగిన ఆ కళను నిన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుందామె. ఇన్నాళ్లూ దాచిన ఆ హిడెన్‌‌‌‌ టాలెంట్ మరేదో కాదు.. కవిత్వం రాయడం. దీపిక ఏడో తరగతి చదువుతున్నప్పుడు ‘I AM’ అనే పదాలు ఇచ్చి ఓ కవిత రాయమన్నారట టీచర్. దాంతో ఆ పదాలనే టైటిల్‌‌‌‌గా పెట్టి మూడు పేరాల కవిత రాసింది దీపిక. లవ్‌‌‌‌ అండ్ కేర్ ఉన్న చిన్నారిని అంటూ మొదలైన ఆ కవితను నిన్న ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పోస్ట్ చేసింది. పన్నెండేళ్ల వయసులో ఈ కవిత రాసిన దీపిక, తర్వాత తండ్రి బాటలో నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, ఆ తర్వాత మోడలింగ్, సినిమాలు అంటూ బిజీ అయింది. అందుకే ఇలా కవిత రాయడం అదే మొదటి, చివరి ప్రయత్నం అని చెప్పింది దీపిక. అయితే చిన్న వయసులోనే ప్రకృతితో మనకున్న రిలేషన్‌‌‌‌ను తెలియజేస్తూ చక్కని కవిత రాసిన దీపిక, మళ్లీ తన రైటింగ్ టాలెంట్‌‌‌‌పై ఫోకస్ పెట్టాలంటున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం పఠాన్, ఫైటర్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాల్లో నటిస్తోంది దీపిక.