షమీ నిన్ను పెళ్లి చేసుకుంటా.. కానీ వన్ కండీషన్ : పాయల్ ఘోష్

షమీ నిన్ను పెళ్లి చేసుకుంటా..  కానీ వన్  కండీషన్ : పాయల్ ఘోష్

టీమిండియా స్టార్ పేసర్  మహమ్మద్ షమీకి బాలీవుడ్ నటి పాయల్ ఘోష్   కండీషన్  పెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చింది.  షమీపై ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  షమీ నీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకో..  నేను నిన్ను  పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ట్వీట్ చేసింది.  అంతేకాకుండా పాయల్ మరో ట్వీట్ చేసింది. ' షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలో చెప్పాలని కోరింది. ముందుగా ఫైనల్స్‌లో భారత్‌ స్థానం సంపాదించాలి. అక్కడ నువ్వు హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను.' అని ట్వీట్ చేసింది.  

కాగా  మహమ్మద్ షమీకి హసిన్ జహాన్‌తో  2014 జూన్ 6న  పెళ్లి  జరిగింది. వీరికి 2015లో ఓ కూతురు జన్మించింది.  2018, మార్చి 8న మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. అయితే ఈ కేసుపై ఇటీవలే తీర్పునిచ్చిన కోల్‌కత్తా కోర్టు.. ప్రతినెలా హసీన్‌కు లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది.

ఇక వన్డే వరల్డ్ కప్ లో మహమ్మద్ షమీ అదరగొడుతున్నాడు.  ప్రత్యర్థులకు తనదైన బంతులతో చుక్కలు చూపిస్తున్నాడు.  ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టిన షమీ.. అత్యధిక వికెట్లు పడగొట్టిన  బౌలర్ల జాబితాలో  టాప్ 5 లో ఉన్నాడు.  అంతేకాదు  ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డును కూడా అందుకున్నాడు.  ఇప్పుడు షమీ టీమిండియా జట్టుకు మోస్ట్ వాటెండ్ ప్లేయర్ అయిపోయాడు.