ఎనర్జీ కోసం 100 బిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేస్తం

ఎనర్జీ కోసం 100 బిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేస్తం
  • ఎనర్జీ కోసం 100 బిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేస్తం
  • ప్రకటించిన అదానీ గ్రూపు చైర్మన్​ గౌతమ్​ అదానీ

న్యూఢిల్లీ: క్లీన్​ ఎనర్జీ, డేటా బిజినెస్​ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అదానీ గ్రూప్ వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.8.14 లక్షల కోట్లు) పైగా పెట్టుబడి పెడుతుందని సింగపూర్‌‌లో జరిగిన ఫోర్బ్స్ గ్లోబల్ సీఈఓ కాన్ఫరెన్స్‌‌లో సంస్థ చైర్మన్​​గౌతమ్ అదానీ చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ కారణంగా భారతదేశం ఏదో ఒక రోజు నికర ఇంధన ఎగుమతిదారుగా మారుతుందని అన్నారు. అదానీ ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడనే విషయం తెలిసిందే. ఈ పెట్టుబడిలో 70 శాతం మొత్తాన్ని ఎనర్జీ ట్రాన్సిషన్​రంగం కోసం ఖర్చు చేస్తారు. మిగతాది డేటా, ఇతర సెగ్మెంట్ల కోసం వాడుతారు.  ఈ గ్రూపు 45 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యువల్​కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని టార్గెట్​గా పెట్టుకుంది.  సోలార్ ప్యానెల్‌‌లు, విండ్ టర్బైన్‌‌లు,  హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌‌లను తయారు చేయడానికి 3 గిగా ఫ్యాక్టరీలను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ సంస్థగా ఎదిగామని, ఈ బిజినెస్​ను మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామని అదానీ చెప్పారు.  గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బిజినెస్​/ వాల్యూ చెయిన్​లో 70 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడతామని వెల్లడించారు. పలు కంపెనీలను దక్కించుకోవడం, డైవర్సిఫికేషన్​ కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 260 బిలియన్  డాలర్లకు చేరుకుంది.

భారతదేశంలోని మరే కంపెనీ కూడా ఇంతకంటే వేగంగా వృద్ధి చెందలేదు. అదానీ గ్రూపుకు సీపోర్టులు, ఎయిర్​పోర్టులు,  గ్రీన్ ఎనర్జీ, సిమెంట్,  డేటా సెంటర్‌‌, ఎఫ్​ఎంసీజీ వంటి వ్యాపారాలు ఉన్నాయి.  లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్  260 బిలియన్ డాలర్లకు పెరిగింది.  "మా ప్రస్తుత 20 గిగావాట్ల రెన్యువల్​ పోర్ట్‌‌ఫోలియోతో పాటు, లక్ష హెక్టార్ల భూమిలో మరో 45 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యువల్ పవర్​ను తయారు చేస్తాం. ఈ జాగా సింగపూర్ విస్తీర్ణం కంటే 1.4 రెట్లు ఎక్కువ. మొత్తం మూడు మిలియన్ మెట్రిక్‌‌ టన్నుల గ్రీన్ హైడ్రోజన్​ తయారీ​సాధ్యమవుతుంది" అని ఆయన చెప్పారు. క్లీన్​ ఎనర్జీ కోసం కంపెనీ మూడు గిగా ఫ్యాక్టరీలను కూడా నిర్మిస్తుంది. - వీటిలో10 గిగావాట్ల సిలికాన్ ఆధారిత ఫోటోవోల్టాయిక్ వాల్యూ చెయిన్​ కోసం ఒకటి ఉంటుంది.  మరో 10 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ విండ్ -టర్బైన్ తయారీ ఫెసిలిటీనీ,  5 గిగావాట్ల హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీని కూడా నిర్మిస్తారు. - గ్రీన్ ఎలక్ట్రాన్​ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్న కంపెనీల్లో ఒకటిగా ఎదిగామని, - గ్రీన్ హైడ్రోజన్‌‌ను కూడా చౌకగా తయారు చేస్తామని అదానీ వివరించారు.