ఎయిర్ ఇండియాలో 500 కొత్త విమానాలు

ఎయిర్ ఇండియాలో 500 కొత్త విమానాలు

ఎయిర్ ఇండియాను హస్తగతం చేసుకున్న తర్వాత టాటా కంపెనీ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 విమానాల కోసం భారీ ఆర్డర్ ఇచ్చేందుకు ఎయిర్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. ఈ ఆర్డర్ విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లు (రూ.8.2 లక్షల కోట్లు) ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. చరిత్రలో ఇదే అతిపెద్ద విమానాల కొనుగోలు ఆర్డర్ ఇదే కావడం విశేషం.

ఇందులో ఎయిర్ బస్, బోయింగ్ విమానాలు ఉండనున్నట్లు సమాచారం. 400 నేరో-బాడీ విమానాలు, 100 వైడ్ బాడీ విమానాలు, ఎయిర్ బస్ ఏ350, బోయింగ్787,777 మాడల్ విమానాలు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ అతిపెద్ద ఆర్డర్ వల్ల ఎయిర్ ఇండియాకు భారీ రాయితీలు సమకూరే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా దగ్గర 218 విమానాలు ఉన్నాయి.