
గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ లో భారత్ దేశం రికార్డు ఎగుమతులను సాధించింది. 2023-24లో భారత్ ఎగుమతులు 778 బిలియన్ డాలర్లకు చేరుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే సేవల్లో ఎగుమతులు పెరిగినా.. సరుకుల ఎగుమతుల్లో స్వల్పంగా క్షీణించాయి.
2022-23లో వస్తు, సేవల ఎగుమతులు 776.3 బిలియన్ డాలర్లనుంచి గణనీయమైన వృద్దిని సాధించింది. ముఖ్యంగా సేవల ఎగుమతులు 2023-24లో 325.3 బిలియన్ల డాలర్లనుంచి 341.1 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. అయితే సరుకుల ఎగుమతులు 451.1 బిలియన్ డాలర్లనుంచి 437.1 బిలియన్ డాలర్లకు స్వల్పంగా క్షీణించాయి.
ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు భారత్ అనేక ప్రభుత్వ కార్యక్రమాలను చేపడుతోంది. పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశాన్ని ఏకీకృతం చేయడం, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాల్లో ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ప్రారంభించడంతోపాటు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసింది.దీంతో భారత్ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలను సాధించింది.
భారతదేశ ఎగుమతులు పెరిగిన దేశాలు
చైనా, రష్యా, ఇరాక్, యుఎఇ , సింగపూర్‌లకు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ UK, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ , దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
ఏప్రిల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు, సేంద్రీయ, అకర్బన రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు, మందులు , ఔషధాల ఎగుమతులు సంవత్సరానికి వృద్ధిని సాధిం చాయి. అయితే, అదే కాలంలో ఇంజినీరింగ్ వస్తువులు, ఇనుప ఖనిజం, రత్నాలు , ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు , చమురు మీల్స్ ఎగుమతులు క్షీణించాయి. పెట్రోలియం క్రూడ్ , ఉత్పత్తులు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పులు, కూరగాయల నూనె దిగుమతులు కూడా పెరిగాయి.