స్టార్టప్‌‌ల కోసం.. పెద్ద కంపెనీలతో డీపీఐఐటీ ఒప్పందాలు

స్టార్టప్‌‌ల కోసం.. పెద్ద కంపెనీలతో డీపీఐఐటీ ఒప్పందాలు

న్యూఢిల్లీ:  స్టార్టప్‌‌ల కోసం మానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌‌ను డెవలప్ చేయడానికి ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) ఇప్పటివరకు ఐటీసీ, ఫ్లిప్‌‌కార్ట్‌‌, మెర్సిడెజ్‌‌ బెంజ్‌తో సహా 50కి పైగా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  ఈ ఒప్పందాల్లో బోట్‌‌, హీరో మోటో, జెప్టో, పేటీఎం, వాల్‌‌మార్ట్‌‌, ఏథర్ ఎనర్జీ  వంటి సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. 

పెద్ద సంస్థలు, యూనికార్న్‌‌లు, పరిశ్రమ సంఘాలతో కలిసి మానుఫ్యాక్చరింగ్ ఇంక్యూబేటర్‌‌ల ఏర్పాటుపై డీపీఐఐటీ దృష్టి పెట్టింది. ఇవి స్టార్టప్‌‌లకు పైలట్, స్కేలింగ్ (విస్తరణ), ప్రొటోటైప్, డిజైన్, మార్కెట్ యాక్సెస్, టెక్నాలజీ మేనేజ్‌‌మెంట్, రిస్క్ క్యాపిటల్ వంటి సేవలు అందిస్తాయి. 

ప్రొడక్షన్‌‌పై దృష్టి పెట్టే  స్టార్టప్‌‌లకు ప్లగ్-అండ్-ప్లే మోడల్‌‌ను అందిస్తాయి. దీంతో వీటికి  అధిక పెట్టుబడి అవసరం ఉండదు.  ఈ ఇంక్యూబేటర్‌‌లు కార్పొరేట్‌‌లు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల ద్వారా ఏర్పాటు చేయొచ్చు.