- పలు రాష్ట్రాల నుంచి హాజరైన కళాకారులు
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ఎస్ సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం భద్రశైల డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది తరలివచ్చి ప్రదర్శనలు ఇచ్చారు. పట్టణానికి చెందిన సంతోషిణి నాట్య నిలయం వ్యవస్థాపకుడు రమాదేవి రామ్ నేతృత్వంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్,
కరీంనగర్, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులకు భోజన ఏర్పాట్లు చేశారు.
