హైదరాబాద్లో బయట అల్లం పేస్ట్.. కొనాలనుకోవడమే పాపమైపోయింది.. 675 కిలోల నకిలీ అల్లం పేస్ట్ సీజ్

హైదరాబాద్లో బయట అల్లం పేస్ట్.. కొనాలనుకోవడమే పాపమైపోయింది.. 675 కిలోల నకిలీ అల్లం పేస్ట్ సీజ్

హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ మైలర్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ అల్లం పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు అలీ నగర్‌లోని సుభాన్ కాలనీ ప్రాంతంలో దాడులు నిర్వహించగా, మొహమ్మద్ జియౌద్దిన్ (45), మొహమ్మద్ మజర్ అలీ (47) అనే వ్యక్తులు ఇంట్లోనే నిబంధనలు పాటించకుండా హానికర రసాయనాలు కలిపి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు బయటపడింది.

తయారు చేసిన అల్లం పేస్ట్‌ను హైదరాబాద్‌లోని స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో 16 చిన్న డ్రమ్ములలో అల్లం పేస్ట్, అల్లం వ్యర్థాలతో కార్టన్‌లు, ప్యాకింగ్ లేబుళ్లు, జాంటన్ గమ్ పౌడర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 675 కిలోల అల్లం పేస్ట్‌ను పోలీసులు సీజ్ చేయగా, దాని విలువ సుమారు రూ.90 వేలుగా అంచనా వేశారు.ఈ ఘటనపై మైలర్ దేవ్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

►ALSO READ | రోడ్డున పడ్డ హాస్టళ్లు.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ హాస్టల్‌లో గ్యాస్ కొరత.. రోడ్డు మీదే వంటలు