మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నప్పటికీ ఏ ఒక్క దేశం తగ్గటం లేదు. ఇరాన్ లో పాలన మార్పు చేసేదాక వదిలేదు లేదని అమెరికా చెప్తుండగా.. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు.. మడమ తిప్పేది లేదని అంతే ఘాటుగా ఇరాన్ యుద్ధంలోకి దూకుతోంది.
లేటెస్టుగా ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేసే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధిని మూసివేసి ఇరాన్.. ఇకనుంచి హార్మూజ్ దాటాలంటే తమ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. అంతే కాదు.. ఆయిల్ సంక్షోభానికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతానికి బ్యారెల్ క్రూడ్ ధర 80 డాలర్లుగా ఉంది. ఇటీవలే 120 కి తాకినప్పటికీ.. మళ్లీ తగ్గింది. అయితే త్వరలో 200 డాలర్లకు చేరుకుంటుందనీ.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఆయిల్ ధరలలో భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. ఎందుకంటే ఆయిల్ ధరలు ప్రాంతీయ భద్రతలపై ఆధారపడి ఉంటాయి. కానీ వాటిని అస్థిరపరిచినందకు అనుభవించాల్సిందే అంటూ ఇరాన్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఇబ్రహీం జొల్పఖరీ పేర్కొన్నారు. పరోక్షంగా అమెరికాను హెచ్చిరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
►ALSO READ | హార్మూజ్లో ఇరాన్ సీమైన్లు! కీలక జలసంధిపై బాంబుల వల.. మృత్యుమార్గంలా 'క్రూడ్' రూట్
ఇరాన్ అమెరికాను దృష్టిలో పెట్టుకుని హెచ్చరించినా మిగతా ప్రపంచ దేశాలు కూడా ఇంధన సంక్షోభానికి గురికాక తప్పడం లేదు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై మిస్సైల్స్, డ్రోన్స్ తో దాడి చేసుకుంటూ ఇరాన్, అమెరికా యుద్ధాన్ని మరింత తీవ్రతరంర చేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సప్లై కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఇంధన సరఫరా ఆగిపోతున్న క్రమంలో పలు దేశాలు, సంస్థలు తమ దగ్గర ఉన్న రిజర్వులను విడుదల చేస్తున్నాయి. లేటెస్టుగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 400 మిలియన్ల బ్యారెల్ ఆయిల్ ను విడుదల చేసింది. మరోవైపు జపాన్ కూడా తమ వద్ద ఉన్న రిజ్వులను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
