కూసుమంచి, వెలుగు: సోలార్ ప్లాంట్తో రైతుకు 25 ఏండ్ల పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో రైతు బీరవల్లి శ్రీనివాసరావుకు మంజూరైన సోలార్ ప్లాంట్ ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఈ శ్రీనివాసచారి మాట్లాడుతూ పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా ఉత్తం అభయాన్ పథకం) ద్వారా ఖమ్మం జిల్లాలో 43 మంది రైతులు ఒప్పందం చేసుకున్నారని, మొదటి నిర్మాణం పూర్తి చేసిన తొలి 2.0 మెగావాట్ సోలార్ ప్లాంట్ కావడం గర్వంగా ఉందన్నారు.
జిల్లాలో 43 మంది రైతులు 70 మెగా వాట్స్ కు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ వారితో కొనుగోలు ఒప్పందం చేసుకోగా, మిగతా నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసచారి, టీజీఆర్ఈడీసీవోడీఎం అజయ్‌కుమార్, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
