నవంబర్ 19న సింగరేణి భవన్ ముట్టడి : హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్

నవంబర్ 19న సింగరేణి భవన్ ముట్టడి : హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్

నస్పూర్, వెలుగు: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిథ్యం సంఘాల వైఫల్యం, మేనేజ్​మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19న హైదరాబాద్​లోని సింగరేణి భవన్​ను ముట్టడించనున్నట్లు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. 

సింగరేణిలో మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని, 150 మస్టర్ల పేరుతో ఇబ్బంది కలిగించే సర్క్యులర్ ను రద్దు చేయాలని,  ఇంటర్నల్ క్లర్క్స్ ను భర్తీ చేయాలని, మారుపేర్లను సవరించాలనే తదితర డిమాండ్లతో సింగరేణి భవన్​ను ముట్టడించనున్నట్లు పేర్కొ న్నారు. గుర్తింపు, ప్రతినిథ్య సంఘాలు కార్మికుల సమస్యలపై దృష్టిపెట్టడం లేదన్నారు. విజిలెన్స్ పేరుతో 

నియామకాలు ఆపడం, అన్​ఫిట్ అయినా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోడం వంటి అనేక సమస్యలున్నా గుర్తింపు, ప్రతినిథ్య సంఘాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు తిప్పారపు కొమురయ్య, అనిల్ రెడ్డి, అశోక్, అనిల్, సాయి, సంపత్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.