టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వృషకర్మ'. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌లో ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక అనూహ్య ఘటన అటు అభిమానులను, ఇటు చిత్ర యూనిట్‌ను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది.
వేదికపై ఏం జరిగింది?
సినిమా గ్లింప్స్ లాంచ్ తర్వాత మీడియా ప్రతినిధులతో ముచ్చటించేందుకు చిత్ర యూనిట్ స్టేజీపైకి వచ్చింది. యూనిట్ సభ్యుల కోసం సిబ్బంది కుర్చీలను ఏర్పాటు చేశారు. నాగచైతన్య తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబోతుండగా, ఆ కుర్చీ ఒక్కసారిగా వెనక్కి వంగిపోయింది. బ్యాలెన్స్ తప్పడంతో చైతన్య వెనక్కి పడిపోయారు. క్షణాల్లో జరిగిన ఈ పరిణామంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. చైతన్య పడిపోతుండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, చిత్ర బృందం వెంటనే అప్రమత్తమై ఆయన్ని పట్టుకున్నారు. దీంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా పెద్ద ప్రమాదం తప్పింది.
చైతూ రియాక్షన్
తమ అభిమాన హీరో కింద పడిపోవడంతో థియేటర్‌లోని ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారు పడ్డారు. వేదికపై గందరగోళం నెలకొంది. అయితే కింద పడినా వెంటనే చైతు తేరుకుని, చిరునవ్వు చిందిస్తూ "ఏమీ కాలేదు.. ఐ యామ్ ఫైన్" అని సైగ చేస్తూ అభిమానులను శాంతింపజేశారు.మరో కుర్చీని తీసుకొచ్చి మీడియా చిట్‌చాట్ కొనసాగించారు . 'వృషకర్మ' విశేషాలను పంచుకున్నారు.
►ALSO READ | Vrushakarma: సృష్టి ధర్మం తప్పినప్పుడు వాడు తప్పక వస్తాడు.. 'వృషకర్మ' గ్లింప్స్ తో వణికిస్తున్న నాగచైతన్య!
ప్రమాదం తప్పినప్పటికీ, అంత పెద్ద ఈవెంట్‌లో నాణ్యత లేని కుర్చీలు వేయడంపై చైతన్య కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ వైఫల్యం వల్ల ఇలాంటి ఘటనలు హీరోల భద్రతకు ముప్పు కలిగిస్తాయని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. 'వృషకర్మ' గ్లింప్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉండటంతో, ఈ చిన్న ప్రమాదం మినహాయిస్తే ఈవెంట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు..
