V6 News

హైదరాబాద్ టోలీచౌకిలో బిల్డింగ్ పై నుంచి పడి..ముగ్గురు కార్మికులు మృతి

హైదరాబాద్ టోలీచౌకిలో బిల్డింగ్ పై నుంచి పడి..ముగ్గురు కార్మికులు మృతి

హైదరాబాద్ టోలీచౌకిలో ఘోర ప్రమాదం జరిగింది. టోలిచౌకిలోని అల్ హస్నాత్ కాలనీలో  భవన నిర్మాణ పనులు చేస్తుండగా..ఐదంతుస్థుల బిల్డింగ్ పై నుంచి ఐదుగురు కార్మికులు కిందపడ్డారు.  ఈ ఘటనలో స్పాట్ లోనే  ముగ్గురు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. 

నూతన భవనానికి గోవా కర్రలు కట్టి వాటిపై నిలబడి  పనులు చేస్తుండగా  ఒక్కసారిగా  కట్టెలు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో వచ్చిన రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 మృతులు   ఏపీ శ్రీకాకుళం ప్రాంతం చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ వారిని లంగర్ హౌస్ లోని ఆలివ్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు . నిబంధనలకు విరుద్ధంగా  భవన నిర్మాణం పనులు జరుగుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ  యజమానికి నోటీసులిచ్చింది.