గణపురం/ వెంకటాపూర్ (రామప్ప)/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా పర్యాటక ప్రాంతాలు ఆదివారం పర్యాటకులు, సందర్శకులతో కిటకిటలాడాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, గణపురం మండలాల్లోని కోటగుళ్లను సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారుల బృందం సందర్శించింది.
అనంతరం ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని ట్రైనీ ఆఫీసర్లు, విదేశీయులు సందర్శించి, ఆలయంలో పూజలు చేశారు. అనంతరం లేక్‌లో బోటింగ్ చేశారు. వరంగల్ కోటలో విదేశీయులు, స్వదేశీ పర్యాటకులు సందడి చేశారు. ఆయా ప్రాంతాల్లోని కట్టడాల గురించి గైడ్స్ వివరించగా, అద్భుతమని కొనియాడారు.
