వరంగల్ వరద బాధితులకు సామగ్రి అందజేత

వరంగల్ వరద బాధితులకు సామగ్రి అందజేత

తొర్రూరు, వెలుగు : వరంగల్​ హంటర్​ రోడ్డులోని ముంపు ప్రాంతానికి గురైన బీఆర్​నగర్​ కాలనీకి చెందిన బాధితులకు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి క్లబ్ అధ్యక్షురాలు లయన్ తుమ్మూరు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రూ.38 వేల విలువైన బియ్యం, నిత్యావసరాలు, చీరలు, దుప్పట్లు, జ్యూట్ బ్యాగ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, డీసీటీ లయన్ చల్లా రఘునాథ రెడ్డి, డీసీఎస్ఎస్ లయన్ మార్గం ప్రభాకర్ పాల్గొన్నారు.

 సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ లయన్ డాక్టర్ ఎస్.నాగవాణి బాధిత కుటుంబాల మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్ లాంటివి నేర్పించేందుకు కృషి చేస్తామని చెప్పడంతో అందుకు రఘునాథ రెడ్డి, మార్గం ప్రభాకర్ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ క్యాబినెట్ మెంబర్ లయన్ డాక్టర్ ఎస్ నాగవాణి, ట్రెజరర్ లయన్ వేముల మంజుల, లయన్ ఉమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.