ఆరేళ్ల అద్దె బాకీ.. డిగ్రీ కాలేజీకి తాళం..మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన

ఆరేళ్ల అద్దె బాకీ.. డిగ్రీ కాలేజీకి తాళం..మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన

మరిపెడ, వెలుగు: ఆరేళ్ల నుంచి అద్దె ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఇంటి యజమానులు సోమవారం సాయంత్రం మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్​కు తాళం వేశారు. ఇంటి ఓనర్లు కాలం రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

ఆరేళ్ల కింద కింద మరిపెడ డిగ్రీ కాలేజీ కోసం కేయూ అధికారులు బిల్డింగ్​ను అద్దెకు తీసుకున్నారు. ఆరేళ్ల నుంచి అద్దె అడుగుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని, రూ.23 లక్షల బకాయి ఉందన్నారు.

అద్దె అడుగుతుండడంతో యూనివర్సిటీ అధికారులు ఆ బిల్డింగ్​ ఖాళీ చేసి మరిపెడ జూనియర్  కాలేజీకి షిఫ్ట్  చేయాలని ఆదేశించారు. దీంతో ఇంటి ఓనర్లు కాలేజీకి చేరుకొని సిబ్బందిని నిలదీశారు. కాలేజీకి తాళం వేసి, అద్దె చెల్లించాక సామగ్రి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.