టీనేజ్ పిల్లల్లో పాప్కార్న్ బ్రెయిన్!..అంటే ఏంటి.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తయ్. ?

టీనేజ్  పిల్లల్లో  పాప్కార్న్ బ్రెయిన్!..అంటే ఏంటి.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తయ్. ?

మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్​గా ఉండడం కుదరదు. మన బాడీలాగే అలసిపోతుంటుంది. అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతుంటుంది. కానీఈ రోజుల్లో పరిస్థితి చూస్తే దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యంగ్​ ఏజ్​ వాళ్లలో బ్రెయిన్​ ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటోంది. ప్రతి చిన్నదానికీ రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటున్నారు. టీవీ చూడటం, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నోటిఫికేషన్లు చెక్ చేయడం లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం ద్వారా డోపమైన్ హిట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ విషయం మీద మానసిక నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. బ్రెయిన్​ నిరంతరం ఎగ్జైట్​మెంట్​తో ఉండడం మంచిది కాదు. దానివల్ల టీనేజీ పిల్లల్లో ‘పాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్న్ బ్రెయిన్’ వస్తోంది అంటున్నారు. అసలు ఈ పాప్​ కార్న్​ బ్రెయిన్​ అంటే ఏంటి? 


2011లో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్, కంప్యూటర్ సైంటిస్ట్ డేవిడ్ లెవీ పాప్​ కార్న్​ బ్రెయిన్ అనే పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చాడు. పాప్​ కార్న్​ బ్రెయిన్​కు లెవీ చెప్పే అర్థం ఏంటంటే... “ఎలక్ట్రానిక్ మల్టీటాస్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటుపడి, నెమ్మదిగా సాగే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ జీవితం మీద ఆసక్తి లేకుండా పోవడం’’. సింపుల్​గా చెప్పాలంటే.. ఏకాగ్రత లేకపోవడం, ఎప్పుడూ మల్టీటాస్క్ చేయాలని తపన పడడం. 

ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే.. స్క్రీన్లు, సోషల్ మీడియా ఎక్కువగా వాడడం వల్లే అంటున్నారు ఎక్స్​పర్ట్స్. 2021లో ఫ్రంటియర్స్ ఇన్ సైకియాట్రీ జర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన పీర్-రివ్యూడ్ అధ్యయనం ప్రకారం.. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ అతిగా వాడితే బ్రెయిన్​ డెవలప్​మెంట్​కు పెద్ద అడ్డంకిగా మారుతుంది. తద్వారా తెలివితేటలు, భావోద్వేగాలు ప్రదర్శించడంలో సమస్యలు వస్తాయి. మెదడు నిజంగానే ప్రతికూలంగా ఆలోచించడం మొదలవుతుంది. ఈ వయసులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పూర్తిగా ఏర్పడదు కాబట్టి ఇది మరీ ప్రమాదం. సాధారణంగా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేయడం అనేది నిర్ణయాలు తీసుకోవడం, ఎమోషన్స్​ను కంట్రోల్​ చేస్తుంది. అంతేకాదు.. రోజుకు రెండు 
గంటలకంటే ఎక్కువ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసే ప్రీస్కూల్​ పిల్లలకు కంటిచూపు సమస్యలు ఎక్కువ అని 2019లో జరిగిన స్టడీలో తేలింది. 

న్యూపోర్ట్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హెల్దీ డివైజ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నేషనల్ అడ్వైజర్ డాన్ గ్రాంట్.. “ఈ సమస్య ADHD లాగ అనిపిస్తుంది. కానీ కాదు. మొక్కజొన్న గింజల్ని వేగిస్తుంటే ఎలాగైతే పాప్​కార్న్​లా పేలుతాయో.. ఈ స్థితిలో ఆలోచనలు కూడా వేగంగా అస్తవ్యస్తంగా వస్తాయి. ఇవి మన బ్రెయిన్​లో డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చే లైక్స్, కామెంట్స్ ఆటోమేటిక్​గా ట్రిగ్గర్ చేస్తాయి” అని పేర్కొన్నారు.

టీనేజ్​లోనే కాదు..

పాప్​ కార్న్​ బ్రెయిన్​ కండిషన్​ ప్రస్తుతం టీనేజ్ వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నా, 30–45 ఏళ్ల వాళ్లలోనూ గుర్తించారు. ఈ సమస్య ఇంకా అధికారికంగా బయటకు రాలేదు కానీ నిజంగానే ఉంది. పాప్​ కార్న్​ బ్రెయిన్​ ఉన్నవాళ్లలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. 

  •  ఎక్కువసేపు ఒకదాని మీద శ్రద్ధ లేకపోవడం.
  • ఒకేసారి వేర్వేరు ఆలోచనలు చేస్తుండడం.
  • ఒక అంశం నుంచి మరో అంశానికి త్వరగా మారడం.
  • ఒకే పనిపై దృష్టి పెట్టలేకపోవడం.
  •  మానసిక అలసట, ఆందోళన, ఒత్తిడి.
  • రియల్ వరల్డ్ కంటే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండాలనుకోవడం.
  • ఇవన్నీ చదువు, భావోద్వేగాలు, నిద్రపై ప్రభావం చూపి జీవిత నాణ్యతను తగ్గిస్తాయి. చివరిగా.. టెక్నాలజీని జీవితాన్ని మెరుగుపరచే టూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడాలి కానీ దానికి బానిస కాకూడదు. 

ఏం చేయాలి?

  • నిద్రకు ముందు, భోజనం చేసే సమయంలో ఫోన్ వాడొద్దు.
  • నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి.
  • ధ్యానం, యోగా, మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ప్రాక్టీస్ చేయండి.
  • టైమింగ్స్​ పెట్టుకోండి. డిజిటల్ డీటాక్స్ చేయండి.
  • పిల్లలకు వారానికి కనీసం
  • 2 గంటల ఆర్గనైజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని ఒక స్టడీ చెప్తోంది.