హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లోనే ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ మృతి

హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లోనే ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ మృతి

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి ప్రాంతంలో శుక్రవారం (మార్చి 6) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఎస్‌ఆర్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు సుప్రతిక్, అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో వారి శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో ఎస్‌ఆర్‌ కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాలేజీ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.